Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:10 PM

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టండి

ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి పట్టం కట్టండి
February 06, 2026 01:25 PM 203 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

తెలంగాణ ప్రజల సంక్షేమం అభివృద్ధికి పట్టం కట్టిన రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో 13 వ వార్డ్ అభివృద్ధి చేస్తానని బత్తుల వాణి విప్లవ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు పథకం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు, రైతుబంధు పథకం, రేషన్ కార్డుల పంపిణీ, లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలు అందరికీ రాజకీయాలకతీతంగా, వర్గాలకతీతంగా ప్రతి వ్యక్తికి చేరేటట్లుగా ప్రభుత్వం పని చేస్తున్నదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తమ పార్టీ వారికే పని చేసిందని, దాదాపు పది సంవత్సరాలపాటు అరాచక అవినీతి, దోపిడీకి తెలంగాణ గురైందని, మళ్లీ అలాంటి పొరపాట్లు చేయకుండా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు.13వ వార్డులో ప్రధాన సమస్యలన్నీ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహాయ సహకారాలతో వార్డు సమస్యలన్నీ పరిష్కరిస్తానని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News