48 వార్డులకు 741 నామినేషన్ల పరిశీలన
సూర్యాపేట
రెండో మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులకు సంబంధించి శనివారం మొత్తం 741 నామినేషన్ దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహించారు.వార్డు నంబర్ 32 నుంచి బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన దేవత్ వేణు పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్లు సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ హన్మంత రెడ్డి తెలిపారు.అలాగే ఒకే వ్యక్తి రెండు సార్లు బలపరిచిన డూప్లికేట్ నామినేషన్‌లుగా గుర్తించిన నాలుగు దరఖాస్తులను కూడా తిరస్కరించినట్లు వెల్లడించారు.మిగతా నామినేషన్ దరఖాస్తులు ఎన్నికల నిబంధనల ప్రకారం సరైనవిగా గుర్తించి స్వీకరించినట్లు అధికారులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి