Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:38 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

02-02-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఫిబ్రవరి 17 నుంచి తిరిగి నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 02: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్న కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు.

వాయిదా పడిన డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సరం వివిధ సెమిస్టర్ల పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10, 2026 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్ వెల్లడించారు.పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పరీక్షకు మూడు రోజుల ముందు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంబంధిత అధ్యయన కేంద్రాలను లేదా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయ డిగ్రీ పరీక్షలు వాయిదా

Article Image

ఫిబ్రవరి 17 నుంచి తిరిగి నిర్వహణ

హైదరాబాద్, ఫిబ్రవరి 02: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తున్న కారణంగా పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు.

వాయిదా పడిన డిగ్రీ మొదటి, రెండవ, మూడవ సంవత్సరం వివిధ సెమిస్టర్ల పరీక్షలను ఫిబ్రవరి 17 నుంచి మార్చి 10, 2026 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ భోజు శ్రీనివాస్ వెల్లడించారు.పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ పరీక్షకు మూడు రోజుల ముందు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ పోర్టల్ ద్వారా హాల్ టికెట్లు పొందవచ్చని సూచించారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంబంధిత అధ్యయన కేంద్రాలను లేదా విశ్వవిద్యాలయ అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించాలని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News