స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది:
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ల స్వీకరణ రేపటి నుంచి (జనవరి 28) ప్రారంభమై, 30 వరకు కొనసాగుతుంది. నామినేషన్ల పరిశీలన జనవరి 31న, ఉపసంహరణకు చివరి గడువు ఫిబ్రవరి 3.
ఎన్నికలు ఫిబ్రవరి 11, 2026 న పోలింగ్ రూపంలో జరగనున్నాయి. కౌంటింగ్ ఫిబ్రవరి 13న నిర్వహించబడుతుంది. ఫలితాల ప్రకటన అనంతరం, ఫిబ్రవరి 16న కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను సౌకర్యవంతంగా నియమించేందుకు ఏర్పాట్లు జరగనున్నాయి.
ఈసారి ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించబడతాయి. మున్సిపాలిటీలలో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు నమోదు అయ్యారు.
ఎన్నికల కోడ్ అమలు అయ్యే వెంటనే పార్టీలు, అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి