Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:39 PM

ఇంటింటికీ అభివృద్ధి సందేశం – అన్న గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన పనులే బలం

18-01-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు అన్న గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు రూపొందించిన క్యాలెండర్‌ను 36వ వార్డులో ఇంటింటికి పంపిణీ చేశారు.పెన్‌పహాడ్ మండలం నుంచి 36వ వార్డుకు ఇన్‌చార్జిలుగా వచ్చిన నాయకులతో కలిసి, గండూరి ప్రవళిక ప్రకాష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో సూర్యాపేట నియోజకవర్గం సాధించిన అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలు, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి అంశాలను క్యాలెండర్ ద్వారా ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో పెన్‌పహాడ్ మండల మాజీ ఎంపీపీ నెమ్మాది బిక్షం, వెన్న సీతారాం రెడ్డి, వెంకన్న, గోపి, కీర్తి వెంకటరావు, సోమయ్య, వెంకట్ రెడ్డి, ఎలమంచిలితో పాటు 36వ వార్డు నాయకులు రాచకొండ కృష్ణ, ఎల్గూరి రామ్మూర్తి, గొట్టిపర్తి శ్రీకాంత్, నందు గారు పాల్గొన్నారు. అలాగే వార్డు యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్న గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే తమకు ప్రధాన బలం అని, భవిష్యత్తులోనూ ఆయన నాయకత్వంలోనే సూర్యాపేట మరింత అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

ఇంటింటికీ అభివృద్ధి సందేశం – అన్న గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి చేసిన పనులే బలం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News