Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:02 AM

ఇంద్రపాలనగరంలో ఘనంగా క్లస్టర్ సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన సర్పంచ్

20-01-2026 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పెంపొందుతాయని అన్నారు. సీఎం కప్ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు తమ ప్రతిభను వెలికితీయడానికి చక్కని వేదికగా మారాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు, సీనియర్ నాయకులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

Sthanikam

ఇంద్రపాలనగరంలో ఘనంగా క్లస్టర్ సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించిన సర్పంచ్

Article Image
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన క్లస్టర్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా పోటీలను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల అభివృద్ధి ద్వారా యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పెంపొందుతాయని అన్నారు. సీఎం కప్ పోటీలు గ్రామీణ క్రీడాకారులకు తమ ప్రతిభను వెలికితీయడానికి చక్కని వేదికగా మారాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, వార్డు సభ్యులు, పంచాయతీ సెక్రటరీ రసూల్, ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ యువకులు, సీనియర్ నాయకులు పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News