Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:47 AM

ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ పూజలు

ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ పూజలు

ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ పూజలు
20-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఆర్యవైశ్యుల కులదేవత వేడుకలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ పూజలను మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మూలవిరాట్ శ్రీ వాసవి మాతకు, ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. వాసవి మాత వ్రతంతో పాటు హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించారు.పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు సింగిరికొండ రవీందర్, ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, కోశాధికారి పోలా రాధాకృష్ణ, కమిటీ సభ్యులు గుండా శ్రీధర్, తల్లాడ సోమయ్య పాల్గొన్నారు. అలాగే భక్తులు తాళ్లపల్లి రామయ్య, శ్రీరంగం రాము, రాచకొండ శ్రీనివాస్, యమ సంతోష్, చల్లా లక్ష్మయ్య, గుండా ఉపేందర్, కలకోట లక్ష్మయ్య, శ్రీనివాస్ గుప్తా, సింగిరికొండ సుకుమార్, తెడ్ల ప్రభాకర్, జూలకంటి నాగరాజు, బజ్జూరి శ్రీనివాస్, బచ్చు పురుషోత్తం, చిలుకల శ్రీనివాస్, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ పూజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News