స్థానికం ప్రతినిధి
ఆత్మకూరు (ఎస్) మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు తండు మహేష్ గౌడ్‌పై గంజాయి బ్యాచ్ దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం గ్రామ శివారులోని తాడి చెట్లు ఎక్కి పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా నలుగురు వ్యక్తులు కర్రలు, కత్తితో మహేష్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.ఈ దాడిలో మహేష్‌కు చేయి రెండు చోట్ల విరిగి ప్యాచర్ అయింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే మహేష్‌ను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొనగా, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి