Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:22 PM

గ్రామ పంచాయతీ సిబ్బందిని విధుల నుంచి తొలగించవద్దు జిల్లా కలెక్టర్ కీలక సర్క్యులర్

20-01-2026 719 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది (ఎంపీడబ్ల్యూలు)ను విధుల నుంచి తొలగించరాదని జిల్లా కలెక్టర్ (పంచాయతీ రాజ్ విభాగం) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సర్క్యులర్ నెం.136/2026-ఎ (పంచా)ను 13 జనవరి 2026న విడుదల చేశారు. కొందరు గ్రామ పంచాయతీ సర్పంచులు కారణం లేకుండా గ్రామ పంచాయతీ సిబ్బందిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి రావడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సర్క్యులర్‌లో పేర్కొన్నారు.జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది (MPWs)లను ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామ పంచాయతీ విధుల నుంచి తొలగించకూడదని డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సర్క్యులర్‌ను జిల్లాలోని అన్ని మండల పంచాయతీ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్), అలాగే పంచాయతీ రాజ్ & ఉపాధి కల్పన డైరెక్టర్‌కు ప్రతులు పంపించారు.

ఇది అత్యంత ముఖ్యమైన అంశంగా భావించి కఠినంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Sthanikam

గ్రామ పంచాయతీ సిబ్బందిని విధుల నుంచి తొలగించవద్దు జిల్లా కలెక్టర్ కీలక సర్క్యులర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News