Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ రేకగ్నైజ్డ్ ఉపాధ్యాయ యూనియన్ చాట్రాయి మండల శాఖ తరపున మండల విద్యాశాఖ అధికారి1 మాసగిరి శ్రీనివాస రావుకు వినతి పత్రం అందజేత

04-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ రేకగ్నైజ్డ్ ఉపాధ్యాయ యూనియన్ చాట్రాయి మండల శాఖ తరపున అధ్యక్షులు నంద్యాల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి తేరా రామారావులు మండల చాట్రాయి మండల విద్యాశాఖాధికారి 1 మాసగిరి శ్రీనివాసరావుకు ఈ క్రింది విషయాలపై ప్రాతినిధ్యం చేశారు.

1. మెగా డీఎస్సీ ఉపాధ్యాయులకు వెంటనే సేవా పుస్తకములు ఓపెన్ చేయవలసిందిగా, 2. వేసవి సెలవులలో పరీక్షలు, ఎన్నికల విధులు మొదలైన విధులకు హాజరై పనిచేసిన కాలానికి సంపాదిత సెలవు మంజూరు చేయించవలసిందిగా, 3. 23 మంది ఉపాధ్యాయుల సంపాదిత సెలవు నగదుగా మార్చుకొనుటకు చేసిన బిల్లు రిజెక్ట్ అయినందున ఆయా ఉపాధ్యాయుల సంపాదిత సెలవు తిరిగి వారి సేవా పుస్తకములలో జమ చేయాలని, ఆన్లైన్ ఎకౌంట్లలోనూ మార్పు చేయవలసిందిగా, 4. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఉపాధ్యాయుల నుండి రికవరీ చేసిన ఇన్కమ్ టాక్స్ మొత్తానికి సంబంధించి టి డి ఎస్ చేయించవలసిందిగా, 5. క్లస్టర్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సేవలను విద్యార్థులు ఎక్కువ ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలకు సర్దుబాటు చేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించవలసిందిగా, 6. మండల విద్యాశాఖకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో ఉపాధ్యాయ సంఘాల ప్రస్తావన రాకుండా చూడవలసిందిగా కోరడమైనదని తెలియజేశారు. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ మెగాడీఎస్సి వారికి బుధవారం నాడు సేవా పుస్తకాలు ఓపెన్ చేస్తామని, అనంతరం వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవు నమోదు చేస్తామని, త్వరలోనే సంపాదిత సెలవు బిల్లు రద్దయిన వారి లీవు వారి సేవా పుస్తకాలలో జమ చేయిస్తామని ,ఆన్లైన్లో మార్పు చేయిస్తామని, 2016-17 సంవత్సరానికి సంబంధించి టిడిఎస్ చేయిస్తామని, సింగిల్ టీచర్ పని చేసే విద్యార్థులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు పరిశీలించి తగు సహకారం అందిస్తామని, వాట్సాప్ గ్రూపులలో సంఘాల ప్రస్తావన రాకూడదని ఇప్పటికే చర్య తీసుకున్నామని , భవిష్యత్తులో తీసుకుంటామని సానుకూలంగా స్పందించారని, అందుకు మండల విద్యాశాఖ అధికారి 1 కి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రతిధులు ఆర్ నాగేశ్వరరావు, అంగిడి ప్రసాద్ లు పాల్గొన్నారు.

Sthanikam

డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ రేకగ్నైజ్డ్ ఉపాధ్యాయ యూనియన్ చాట్రాయి మండల శాఖ తరపున మండల విద్యాశాఖ అధికారి1 మాసగిరి శ్రీనివాస రావుకు వినతి పత్రం అందజేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News