Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:20 PM

డీఆర్‌డీఓలో చిట్యాల మండల సర్పంచులకు అభివృద్ధిపై శిక్షణా తరగతులు

20-01-2026 239 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నల్లగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని నల్లగొండ డీఆర్‌డీఓ కార్యాలయంలో చిట్యాల మండలానికి చెందిన సర్పంచులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల సద్వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై అధికారుల ద్వారా విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు, పచ్చదనం పెంపకం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సర్పంచులకు మెలకువలు, సూచనలు ఇచ్చారు.శిక్షణా తరగతులకు హాజరైన చిట్యాల మండల సర్పంచులు ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

Sthanikam

డీఆర్‌డీఓలో చిట్యాల మండల సర్పంచులకు అభివృద్ధిపై శిక్షణా తరగతులు

Article Image
నల్లగొండ స్థానికం ప్రధాన ప్రతినిధి

గ్రామాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని నల్లగొండ డీఆర్‌డీఓ కార్యాలయంలో చిట్యాల మండలానికి చెందిన సర్పంచులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల సద్వినియోగం, ప్రభుత్వ పథకాల అమలు, పారదర్శకత వంటి అంశాలపై అధికారుల ద్వారా విస్తృత అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం, త్రాగునీటి సౌకర్యాలు, ఉపాధి హామీ పనులు, పచ్చదనం పెంపకం వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సర్పంచులకు మెలకువలు, సూచనలు ఇచ్చారు.శిక్షణా తరగతులకు హాజరైన చిట్యాల మండల సర్పంచులు ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఉపయోగకరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News