Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:13 PM

చౌటుప్పల్ పురపాలక సంఘం అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ నిర్వహణపై అవగాహన సదస్సు

04-02-2026 227 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సహాయ జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి

మున్సిపల్ కార్యాలయ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ -2026) అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఉదయం11:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించడమైనది.ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను ఎలా నమోదు చేయాలి, రిజిస్టర్లను ఏవిధంగా నిర్వహించాలి, నిబంధనలకు లోబడి ఖర్చులను ఎలా చూపించాలనే అంశాలపై సమగ్రంగా వివరించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలతో కూడిన హ్యాండ్ బుక్,ఇతర ముఖ్యమైన సమాచార మెటీరియల్‌ను అందజేశారు.నిబంధనల అమలుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఖచ్చితంగా పాటించాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరేందర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, ఎన్నికల సిబ్బంది, వివిధ వార్డుల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ పురపాలక సంఘం అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ నిర్వహణపై అవగాహన సదస్సు

Article Image

సహాయ జిల్లా ఎన్నికల అధికారి కమిషనర్ జి వెంకట్రామిరెడ్డి

మున్సిపల్ కార్యాలయ సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ -2026) అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ఉదయం11:30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించడమైనది.ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులను ఎలా నమోదు చేయాలి, రిజిస్టర్లను ఏవిధంగా నిర్వహించాలి, నిబంధనలకు లోబడి ఖర్చులను ఎలా చూపించాలనే అంశాలపై సమగ్రంగా వివరించారు.మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల నిబంధనలతో కూడిన హ్యాండ్ బుక్,ఇతర ముఖ్యమైన సమాచార మెటీరియల్‌ను అందజేశారు.నిబంధనల అమలుకు ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా జరిగేందుకు అభ్యర్థులందరూ ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఖచ్చితంగా పాటించాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నరేందర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ రఘుపతి, ఎన్నికల సిబ్బంది, వివిధ వార్డుల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News