Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:49 PM

భాజపా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల

భాజపా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల

భాజపా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితా విడుదల
February 01, 2026 07:48 PM 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అభ్యర్థులను పార్టీ కండువాలతో సన్మానించిన మాజీ ఎమ్మెల్యే సంకినేని

సూర్యాపేట పట్టణంలోని త్రిబుల్ ఆర్ ఫంక్షన్ హాల్‌లో మున్సిపల్ ఎన్నికల కన్వీనర్ జుట్టుకొండ సత్యనారాయణ ఆధ్వర్యంలో పట్టణ భాజపా సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో భాజపా మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా ఇంచార్జి తుటిపల్లి రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ హాజరై అభ్యర్థులకు పార్టీ కండువాలు కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీపై భాజపా జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి అభ్యర్థి అలసత్వం వహించకుండా ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి వార్డులో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి, జెండాలతో అలంకరించిన ఆటోల ద్వారా ప్రచారం చేయాలని, గడపగడపకు భాజపా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు.దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయని, మున్సిపాలిటీలకు నేరుగా నిధులు అందిస్తున్నదని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం, జాతీయ రహదారుల నిర్మాణం మోదీ ప్రభుత్వం చేపడుతోందని పేర్కొన్నారు.

భాజపా ఖరారైన సూర్యాపేట మున్సిపల్ అభ్యర్థులు

1వ వార్డు – బానోతు నరసింహ

2వ వార్డు – అంతటి నాగేష్

3వ వార్డు – పడిదల కిరణ్

4వ వార్డు – సిరిపంగి ప్రసాద్ స్వాతి

6వ వార్డు – బండపల్లి శ్రీనివాస్

7వ వార్డు – ఎడ్ల శివకుమార్

8వ వార్డు – పోతురాజు సాగర్ శోభారాణి

9వ వార్డు – గుండగాని జానీ గౌడ్ రమణ

10వ వార్డు – మర్రి చంటి

11వ వార్డు – గుడిసె ఊర్మిళ వెంకన్న

12వ వార్డు – ఓబులోజు వెంకటాచారి

14వ వార్డు – గట్ల ఉమేష్

15వ వార్డు – తాడూరి జ్యోతి

16వ వార్డు – సలిగంటి వీరేందర్

17వ వార్డు – కుంచం సురేష్ మహేశ్వరి

18వ వార్డు – బొల్లం నాగమణి

19వ వార్డు – పిడమర్తి కీర్తి లవన్

20వ వార్డు – గోగుల రమేష్ నాగలక్ష్మి

21వ వార్డు – పొడపంగి రత్నం రమణకుమారి

22వ వార్డు – పెండ్ర కృష్ణ కమలమ్మ

24వ వార్డు – గజ్జల వెంకటరెడ్డి

25వ వార్డు – పిట్టల వెంకన్న ప్రమీల

26వ వార్డు – కందుల రమేష్ లీల

27వ వార్డు – కుంచం యాదగిరి దుర్గ

28వ వార్డు – తప్పెట్ల విజయకుమార్

29వ వార్డు – దొంతగాని మాధవి

30వ వార్డు – మామిడి లక్ష్మమ్మ

31వ వార్డు – దోసకాయల ఫణి నాయుడు

32వ వార్డు – ధరావత్ లింగ నాయక్

33వ వార్డు – దండ రవిచందర్ రెడ్డి

34వ వార్డు – శివరాత్రి రవి

35వ వార్డు – ఆకారపు ఉషారాణి పరిపూర్ణ చారి

36వ వార్డు – ఎల్గూరి రామ్మూర్తి గౌడ్ నాగమణి

37వ వార్డు – మహమ్మద్ అబిద్

38వ వార్డు – ఆరూరి శివ

39వ వార్డు – బహురోజు రాజశేఖర్ కవిత

40వ వార్డు – వీరెల్లి ఉమా

41వ వార్డు – మామిడి నాగరాజు యాదవ్

42వ వార్డు – చల్లమల్ల నరసింహ

43వ వార్డు – పలస మహాలక్ష్మి మల్సూర్ గౌడ్

44వ వార్డు – బూర లక్ష్మణ్ రమాదేవి

45వ వార్డు – నూకల శైలేందర్ రమాదేవి

46వ వార్డు – పోలోజు మౌనిక

47వ వార్డు – పోలగాని ధనుంజయ గౌడ్

48వ వార్డు – కారింగుల దీప

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలత రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, మున్సిపల్ ఎన్నికల సహ కన్వీనర్ రంగరాజు రుక్మారావు, తుక్కాని మన్మథ రెడ్డి తదితర భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News