Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:33 PM

బెల్టు షాపుల నిషేధం కోరుతూ సర్పంచ్‌కు వినతి

01-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మరిపడిగలో అక్రమ మద్యానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు

గుండాల మండలంలోని మరిపడిగ గ్రామంలో అక్రమంగా కొనసాగుతున్న బెల్టు షాపులపై గ్రామ ప్రజలు, యువత ఐక్యంగా తిరుగుబాటు స్వరం వినిపించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న అక్రమ మద్యం విక్రయాలు గ్రామ సామాజిక జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయని ఆరోపిస్తూ బెల్టు షాపులపై తక్షణమే నిషేధం విధించాలని డిమాండ్ చేశారు.గ్రామ పంచాయితీ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ యువత పెద్ద ఎత్తున పాల్గొని అక్రమ మద్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెల్టు షాపుల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, మహిళలు, కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గ్రామ పంచాయితీ సర్పంచ్‌కు వినతి పత్రం అందజేశారు.వినతి పత్రాన్ని స్వీకరించిన సర్పంచ్ గూడెపు కుమార్ మాట్లాడుతూ అక్రమ బెల్టు షాపుల వల్ల కలిగే సామాజిక దుష్పరిణామాలను తాము కూడా గమనిస్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసి అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సొప్పరి సోమన్నతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. మద్యపాన రహిత గ్రామ నిర్మాణమే లక్ష్యంగా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

Sthanikam

బెల్టు షాపుల నిషేధం కోరుతూ సర్పంచ్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News