Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

అనుమతులు లేకుండా వైద్య సేవలు – నకిలీ ఆర్ఎంపీ అరెస్ట్

06-02-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వైద్యశాఖ అనుమతులు లేకుండా ఆర్ఎంపీ వైద్యంతో పాటు మెడికల్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిశ, చైతన్యపురి ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఇన్‌స్పెక్టర్ కె. వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కేశోజు జలేంద్రచారి ఎన్టీఆర్ నగర్ ఫేజ్–3లో బాలాజీ మెడికల్, జనరల్ స్టోర్‌తో పాటు ఫస్ట్ ఎయిడ్ క్లినిక్‌ను ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న, భరత్ నగర్ నివాసి డాక్టర్ గోపాలకృష్ణ ఈ నెల 5న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఫిర్యాదు అందుకున్న ఎస్సై సతీష్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టగా నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్న విషయం నిర్ధారణ అయింది. విచారణలో నిందితుడు నేరానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి స్టెతస్కోప్, రక్తపోటు పరీక్ష యంత్రం, ఉష్ణోగ్రత కొలిచే పరికరం, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ పుస్తకం, గుర్తింపు కార్డును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ ఘటనతో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందించే వారిపై కఠిన చర్యలు తప్పవన్న హెచ్చరికను పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.

Sthanikam

అనుమతులు లేకుండా వైద్య సేవలు – నకిలీ ఆర్ఎంపీ అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News