Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:48 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పాత బ్యాచ్‌లకు రీ–అడ్మిషన్

22-01-2026 197 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1986–2013 డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశం

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పాత బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులకు కోర్సులు పూర్తి చేసుకునేందుకు ప్రత్యేక అవకాశం కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. గతంలో చేరి, వివిధ కారణాలతో సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థుల విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ‘స్పెషల్ రీ–అడ్మిషన్’ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా. వై. వెంకటేశ్వర్లు తెలిపారు.

విద్యా సంవత్సరం 1986 నుంచి 2013 వరకు బి.ఏ, బి.కాం, బి.ఎస్‌సి కోర్సుల్లో చేరిన పాత బ్యాచ్ విద్యార్థులు ఈ ప్రత్యేక రీ–అడ్మిషన్‌కు అర్హులని వెల్లడించారు. గతంలో విశ్వవిద్యాలయంలో చదువుకుని మధ్యలో నిలిచిపోయిన వారు, తమ డిగ్రీ పూర్తిచేసుకునేందుకు ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.రీ–అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు జూబ్లీహిల్స్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రధాన కార్యాలయంలో విద్యార్థి సేవల విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. రీ–అడ్మిషన్ పొందిన విద్యార్థులకు డిసెంబర్ 2026 వరకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేందుకు రెండు అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్ www.braou.ac.in ను సందర్శించవచ్చని, లేదా కాల్ సెంటర్ 1800 599 0101, హెల్ప్‌డెస్క్ నంబర్లు 040–23680–222 / 333 / 555 లలో సంప్రదించాలని సూచించారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పాత బ్యాచ్‌లకు రీ–అడ్మిషన్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News