రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంటల వైవిధ్యీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి తీగల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం కోదాడ మండలంలోని గుడిబండ, తొగర్రాయి గ్రామాల్లో పర్యటించి రైతులు సాగు చేస్తున్న కాలీఫ్లవర్, ఇతర కూరగాయల పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉన్నందున నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. కూరగాయల సాగుతో పాటు ఉద్యాన పంటల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి అనిత పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలి
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి