కోదాడ పట్టణంలోని బంగారు దుకాణంలో జరిగిన భారీ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి శుక్రవారం చోరీ జరిగిన దుకాణాన్ని సందర్శించి ఘటనాస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్ టీమ్ సిబ్బందిని రప్పించి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరింపజేశారు. దుకాణ యజమానిని కలిసి చోరీ జరిగిన తీరుతో పాటు దుండగులు ప్రవేశించిన మార్గం, అపహరణకు గురైన ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. చోరీ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, అందుబాటులో ఉన్న ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తిస్తామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని, చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచుతామని పేర్కొన్నారు.
దుండగుల కోసం పోలీసుల వేట.. చోరీ స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి