చిన్న వయసులోనే తనలోని కళానైపుణ్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు కోదాడ పట్టణానికి చెందిన తూమాటి భావన. చదువుకునేందుకు ఉపయోగించే చిన్నపాటి చాక్‌పీస్‌పై పూరి జగన్నాథుడి విభిన్న రూపాలను ఎంతో నైపుణ్యంతో చెక్కుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. ఆర్ఎంపీ వైద్యులు తూమాటి రామకృష్ణ, అశ్విని దంపతుల కుమారుడైన భావన ప్రస్తుతం ఏడో తరగతి చదువుతున్నాడు. అతి తక్కువ స్థలంలో సూక్ష్మమైన వివరాలతో అందమైన ఆకృతులను తీర్చిదిద్దడం అతడి ప్రత్యేకతగా నిలుస్తోంది. చదువుతో పాటు కళలపై ఆసక్తి పెంచుకుంటూ తన సృజనాత్మకతను చాటుకుంటున్న బాలుడి ప్రతిభను చూసి స్థానికులు, పలువురు కళాభిమానులు ప్రశంసిస్తున్నారు. భావనకు తగిన ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని అద్భుత కళారూపాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
చాక్‌పీస్‌పై జగన్నాథుడి రూపాలు.. బాలుడి అద్భుత ప్రతిభ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి