చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం హుండీ కానుకలను శుక్రవారం లెక్కించారు. నల్గొండ దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో, ఆలయ ప్రాంగణంలో ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. గత 135 రోజులుగా భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించగా.. నోట్ల రూపంలో రూ.15,32,250, చిల్లర రూపంలో రూ.81,777 చొప్పున మొత్తం రూ.16,14,027 ఆదాయం సమకూరినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) సల్వాది మోహన్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కంచర్ల అశ్వినిరెడ్డి, ధర్మకర్తలు జొన్నకంటి దాసు, డి.రాజేష్, ఇ.బాబు, ఎస్.ఆనంద్‌రెడ్డి, వి.శివాచారి, బి.నరసింహ, ఎం.మహేందర్‌రెడ్డి, బి.యువరాజు, పి.రమేష్, బి.శ్రీకాంత్, సిహెచ్.సబిత పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు సుక్క రవీందర్, ఈడుతుల ఇంద్రసేనారెడ్డి, ఫకీరు వంశీధర్‌రెడ్డి, సేవా సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది ఎ.సైదయ్య, పి.కుమార్, ఆలయ సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి