సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి చదరంగం పోటీల్లో మునగాల మండల కేంద్రానికి చెందిన బంగారపు వేదశ్రీ ప్రతిభ కనబరిచింది.బాలికల అండర్-14 విభాగంలో పోటీపడి ఐదు పాయింట్లకు గాను నాలుగు పాయింట్లు సాధించి ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్‌కు ఎంపికైంది.ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న వేదశ్రీ సాధించిన విజయంపై పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కె. వీరబాబు, ఇన్చార్జి ప్రిన్సిపల్ జె. రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రతిభ పాఠశాలకు గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు వేదశ్రీని అభినందించారు.
చదరంగంలో సత్తా చాటిన మునగాల విద్యార్థిని వేదశ్రీ
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి