Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

23వ డివిజన్‌లో కోమటిరెడ్డి రోడ్‌షో

23వ డివిజన్‌లో కోమటిరెడ్డి రోడ్‌షో

23వ డివిజన్‌లో కోమటిరెడ్డి రోడ్‌షో
08-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండలో కాంగ్రెస్ ప్రచార హోరు

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం 23వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థికి మద్దతుగా భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రజల నుంచి ఉత్సాహభరిత స్పందన లభించింది.రోడ్‌షో సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల సంపూర్ణ మద్దతు అవసరమని స్పష్టం చేశారు. మౌలిక వసతుల కల్పన, పట్టణ సుందరీకరణ, సంక్షేమ పథకాల అమలే కాంగ్రెస్ ప్రభుత్వ అజెండా అని తెలిపారు.ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసే శక్తి కాంగ్రెస్‌కే ఉందని పేర్కొంటూ, 23వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

23వ డివిజన్‌లో కోమటిరెడ్డి రోడ్‌షో

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News