Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:33 AM

నాగార్జున స్కూల్లో ప్రయోగాత్మకంగా జాతీయ సైన్స్ డే

28-02-2026 238 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ సైన్స్ డే సందర్భంగా నాగార్జున స్కూల్లో విద్యార్థులు శాస్త్రీయ ప్రాజెక్టులతో ఆకట్టుకున్నారు. ప్రయోగాత్మక విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను విశేషంగా మెప్పించింది.

స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ నాగరాజు ప్రతీకాత్మకంగా రాకెట్ ప్రయోగం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.

రాకెట్ లాంచింగ్, వాటర్ ప్యూరిఫైయర్ నమూనా, కాంతి ద్వారా శక్తి ఉత్పత్తి, హెల్తీ ఫుడ్–జంక్ ఫుడ్ మధ్య తేడాలు, C. V. రమణ ప్రతిపాదించిన రామన్ ఎఫెక్ట్ పై ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా వివరిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు విద్యార్థులను అభినందిస్తూ శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రేఖ.ఎన్, ఉపాధ్యాయులు నరసింహ, స్వప్న, సంధ్య, విజయశ్రీ, లత, వినిష తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఉత్సాహం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Sthanikam

నాగార్జున స్కూల్లో ప్రయోగాత్మకంగా జాతీయ సైన్స్ డే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News