Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

మహిళలు లేనిదే మనుగడ లేదు: సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్

09-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సృష్టి మనుగడకు మహిళలే ఆధారమని, స్త్రీ లేకపోతే జననం–గమనం ఉండదని మండలంలోని పల్లివాడ గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం గ్రామంలో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మహిళా సంఘం సభ్యులను సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు అమ్మగా జన్మనిచ్చి, ఆత్మీయురాలిగా అండగా నిలిచి, భార్యగా కుటుంబాన్ని నడిపిస్తూ సమాజ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. వృత్తిపరంగా కూడా మహిళలు అద్భుతాలు సృష్టిస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పావురాల మచ్చగిరి, వార్డు సభ్యులు కంబాలపల్లి మధు, దండిగ నరసింహ, గ్రామపంచాయతీ సిబ్బంది మచ్చగిరి, బట్టు మీనయ్య, గ్రామ యువకులు దండిగ సందీప్, దండిగ నాగరాజు, దేశపాక రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళలు లేనిదే మనుగడ లేదు: సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News