Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

ఆదరించి ఆశీర్వదిస్తే..13వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా

08-02-2026 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

13వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుండెబోయిన పూజిత వెంకటస్వామి

చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం13వ వార్డులో సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి గుండెబోయిన పూజిత వెంకటస్వామి ఆదివారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. కృష్ణానగర్ నుంచి ప్రచారాన్ని ప్రారంభించి రామ్ నగర్ మీదుగా జాతీయ రహదారి వెంట పద్మశాలి కాలనీ వరకు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి, ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు ఓటు ద్వారా మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.ఈ సందర్భంగా గుండెబోయిన పూజిత వెంకటస్వామి మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 13 వ వార్డు అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. సిసి రోడ్లు, విద్యుత్ స్తంభాలు, లో వోల్టేజ్ నివారణకు ట్రాన్స్ ఫార్మర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు 13వ వార్డులో అతిపెద్ద డ్రైనేజీని నిర్మించిన ఘనత గత ప్రభుత్వ సొంతమన్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో,13వ వార్డు అభివృద్దే ధ్యేయంగా మీ ముందుకు వచ్చానన్నారు. తనను ఆదరించి ఆశీర్వదిస్తే, వార్డును అభివృద్ధి పథంలో నడుపుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు జెటంగి కృష్ణ, బీఆర్ఎస్ వై నాయకుడు చెవగోని మహేష్ గౌడ్, వార్డు అధ్యక్షుడు గుండెబోయిన మల్లేష్ యాదవ్, ఏనుగుల యాదయ్య, జెటంగి రాజు, మొగుదాల అంజయ్య, జెటంగి రవి, ఏనుగుల లక్ష్మణ్, మొగుదాల విజయ్, పల్స రాకేష్, మీసాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదరించి ఆశీర్వదిస్తే..13వ వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News