Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:06 PM

రామన్నపేటలో కాంగ్రెస్‌కు భారీ షాక్

రామన్నపేటలో కాంగ్రెస్‌కు భారీ షాక్

రామన్నపేటలో కాంగ్రెస్‌కు భారీ షాక్
15-12-2025 293 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ఎన్నికల్లో BRS దూకుడు – అధికార పార్టీకే పరిమిత విజయం

రామన్నపేట (యాదాద్రి భువనగిరి):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 24 గ్రామపంచాయతీలు ఉన్న ఈ మండలంలో రెండు గ్రామపంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన 22 గ్రామపంచాయతీల్లో జరిగిన పోటీల్లో BRS పార్టీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది.

ఈ ఎన్నికల్లో BRS పార్టీ 7 గ్రామపంచాయతీలను స్వయంగా గెలుచుకోగా, సిపిఎం పార్టీతో అలవెన్స్ కుదుర్చుకుని మరో 2 స్థానాలు దక్కించుకుంది. అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతుతో మొత్తం 10 గ్రామపంచాయతీలపై BRS పట్టు సాధించింది.

అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 12 గ్రామపంచాయతీలకే పరిమితమైంది. ఏకగ్రీవంగా రెండు గ్రామపంచాయతీలు మొత్తం 14,అధికారంలో ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మండలవ్యాప్తంగా కాంగ్రెస్‌కు వ్యతిరేక ఓటింగ్ స్పష్టంగా కనిపించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తంగా రామన్నపేట మండలంలో వచ్చిన ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణాలకు సంకేతంగా మారాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Sthanikam

రామన్నపేటలో కాంగ్రెస్‌కు భారీ షాక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News