Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:04 PM

ప్రతిపక్షం లేని పాలన… కానీ కోతుల పాలన

ప్రతిపక్షం లేని పాలన… కానీ కోతుల పాలన

ప్రతిపక్షం లేని పాలన… కానీ కోతుల పాలన
20-12-2025 311 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్పంచ్ సాబ్… కోతులు ఎప్పుడూ కదులుతాయి?

గ్రామ పాలనకు తొలి పరీక్ష… కోతుల బెడద

స్థానికం ప్రతినిధి

గ్రామంలో కొత్త సర్పంచ్ వచ్చాడంటే మొదట ఎదురయ్యేది రాజకీయ విమర్శ కాదు. ప్రత్యర్థి కూటమి కాదు. ఉదయాన్నే పైకప్పుల మీద నుంచి చూస్తూ నవ్వే కోతి మూకలే. ఈ ఎన్నికల్లో హామీల జాబితా పొడవైంది. కానీ ఓటరు చెవిలో బలంగా పడింది ఒక్క మాటే—“కోతుల బెడద నుంచి విముక్తి.”

పోస్టర్లు, ప్రసంగాలు, ప్రచార రథాలు… అన్నింటిలోనూ కోతుల కథే. గెలుపు వచ్చేసరికి సమస్య కూడా మరింత స్పష్టంగా కనిపించింది. సర్పంచ్ కుర్చీ కంటే ముందే కోతులు గ్రామాన్ని ఆక్రమించాయి. పొలాల్లో పంటలు నశిస్తున్నాయి. వీధుల్లో పిల్లలు భయంతో పరుగులు పెడుతున్నారు. ఇళ్లలోకి చొచ్చుకొచ్చే వానరాలు రోజువారీ జీవితాన్ని తలకిందులు చేస్తున్నాయి.

ఇప్పుడు నాయకత్వానికి నిజమైన పరీక్ష మొదలైంది. ఫైలుల్లో సమస్య రాస్తే కోతులు పారిపోవు. మీటింగ్ పెట్టినా మూకలు వినవు. చేతిలో అధికారం ఉంది కానీ ఎదురుగా అడ్డుకోలేని శక్తి ఉంది.

ఇచ్చిన మాట నిలబడుతుందా? లేక కోతుల అలవాట్లకే గ్రామం అలవాటు పడుతుందా? అన్నదే ఇప్పుడు చర్చ. కొత్త సర్పంచ్ పాలనను ప్రజలు పనులతో కొలవరు… ఈసారి కోతుల సంఖ్యతో కొలుస్తారు.

Sthanikam

ప్రతిపక్షం లేని పాలన… కానీ కోతుల పాలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News