Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:06 PM

పీఏసీఎస్ పాలకవర్గాల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

20-12-2025 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పీఏసీఎస్ పాలకవర్గాల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

స్థానిక ప్రతినిధి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాలను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లతో కూడిన పాలకవర్గాల పదవీకాలం తక్షణమే ముగిసినట్లయింది.

సహకార శాఖ ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త పాలకవర్గాల ఏర్పాటుకు ఎన్నికల ప్రక్రియ చేపట్టే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయనున్నట్లు సమాచారం. అప్పటివరకు సంఘాల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.

ఈ ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాల రాజకీయ సమీకరణల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. రైతు రుణాలు, ధాన్యం కొనుగోలు, ఎరువుల పంపిణీ వంటి అంశాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుందని సహకార వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Sthanikam

పీఏసీఎస్ పాలకవర్గాల రద్దుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News