Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:02 AM

నీ ప్రేమకు దాసోహం! జవాన్ సేవా ఫౌండేషన్ అధినేత శివుడు జవాన్ కు భావోద్వేగ లేఖ

15-01-2026 162 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం న్యూస్: సమాజ సేవనే ఊపిరిగా, అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేస్తూ "శివుడు" అని అందరిచేతా పిలిపించుకుంటున్న పబ్బు శివ (శివుడు జవాన్) గురించి మనందరికీ తెలిసిందే. దేశం కోసం సైనికుడు కాలేకపోయినా, సమాజం కోసం సైనికుడిలా పనిచేస్తూ "జవాన్ సేవా ఫౌండేషన్" ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజాగా భోగి పండుగ సందర్భంగా, మహేష్ తమ్మడి శివుడు జవాన్ సేవా దృక్పథాన్ని, త్యాగాన్ని కొనియాడుతూ రాసిన ఒక కవిత సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "శివుడు.. శివుడే..!" అంటూ సాగే ఈ కవితలో శివ జవాన్ చేస్తున్న నిస్వార్థ సేవను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

దీనికి స్పందిస్తూ శివుడు జవాన్ తన సోదరుడు మహేష్ తమ్మడికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక భావోద్వేగపు నోట్‌ను ఇచ్చారు.

శివుడు జవాన్ మాటల్లొ:

"అన్నయ్యా... మహేష్ తమ్మడి..
ఈ భోగి పండుగ నాడు సంతోషంగా గడపాలి అనుకున్నా. కానీ నా పైన మీకున్న ప్రేమను ఇలా అక్షరాల రూపంలో చూశాక మాటలు రావడం లేదు. అనాధ శవాలకు దిక్కై, పేదలకు అండగా నిలబడాలనే నా తపనను మీరు గుర్తించిన తీరు నా బాధ్యతను మరింత పెంచింది.
సైనికుడిలా దేశ సేవ చేయలేకపోయినా, సమాజ సేవకుడిగా మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించుకోవడం నా పూర్వజన్మ సుకృతం. 'శతాయుష్మంతుడవై వర్ధిల్లు' అని మీరు ఇచ్చిన దీవెన, నా సేవా ప్రయాణానికి వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చింది.
నా ప్రతీ అడుగులో తోడుగా నిలుస్తున్న మీకు, మరియు 'జవాన్ సేవా ఫౌండేషన్' దాతలందరికీ పాదాభివందనాలు. మీ నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయను."
- మీ తమ్ముడు, శివుడు జవాన్ (పబ్బు శివ)

స్థానికం కధనం:

నిజమే కదా, తోటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన దేవుడు. అలాంటి దేవుడిలా మారిన శివుడు జవాన్ కి, వారి సేవలను గుర్తించి ప్రోత్సహిస్తున్న మహేష్ కి "స్థానికం" తరపున హృదయపూర్వక అభినందనలు.

Sthanikam

నీ ప్రేమకు దాసోహం! జవాన్ సేవా ఫౌండేషన్ అధినేత శివుడు జవాన్ కు భావోద్వేగ లేఖ

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News