Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:27 AM

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
08-01-2026 430 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనవరి 16న నోటిఫికేషన్… ఫిబ్రవరి 3న పోలింగ్, 6న కౌంటింగ్

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది. జనవరి 16వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జనవరి 18, 19, 20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. జనవరి 21న నామినేషన్ల పరిశీలన జరుగనుండగా, జనవరి 23న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు.

జనవరి 24న అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు చేపట్టనున్నారు. జనవరి 25 నుంచి ఎన్నికల ప్రచారం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 1న సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఫిబ్రవరి 3న పోలింగ్ నిర్వహించనుండగా, ఫిబ్రవరి 6న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.

ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడుదలతో మున్సిపల్ రాజకీయాలు వేడెక్కనున్నాయి.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News