Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 01:06 PM

మహిళలపై చులకన వ్యాఖ్యలు చేయను: శివాజీ స్పష్టం

మహిళలపై చులకన వ్యాఖ్యలు చేయను: శివాజీ స్పష్టం

మహిళలపై చులకన వ్యాఖ్యలు చేయను: శివాజీ స్పష్టం
27-12-2025 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళల పట్ల చులకనగా మాట్లాడబోను: శివాజీ

హైదరాబాద్ – స్థానిక ప్రతినిధి

మహిళలపై చేసిన వ్యాఖ్యలు తనను ఇబ్బందుల్లోకి నెట్టిన నేపథ్యంలో, నటుడు శివాజీ స్వరాన్ని మార్చారు. వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన ఆయన… ఇకపై మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానని స్పష్టం చేశారు.

మహిళల పట్ల అవమానకరంగా మాట్లాడినట్టు వచ్చిన ఫిర్యాదులపై మహిళా కమిషన్ నేడు శివాజీకి సమన్లు జారీ చేయగా, ఆయన స్వయంగా హాజరై తన వాదన వినిపించారు. ఈ సందర్భంగా తన మాటలు కొందరిని బాధపెట్టాయన్న భావన ఉంటే అది తన ఉద్దేశం కాదని, భవిష్యత్తులో మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని కమిషన్‌కు హామీ ఇచ్చారు.

కమిషన్ సభ్యులు శివాజీకి కఠినంగానే సూచనలు చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు, ముఖ్యంగా సెలబ్రిటీలు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుందని గుర్తు చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు సహించబోమని స్పష్టంగా హెచ్చరించారు.

Sthanikam

మహిళలపై చులకన వ్యాఖ్యలు చేయను: శివాజీ స్పష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News