Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:19 AM

యువత స్వశక్తితో ఎదగాలి: ఎస్‌.ఐ రవి కుమార్

20-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల,

యువత స్వయంప్రతిభతో ఆర్థికంగా నిలదొక్కుకోవాలని రవి కుమార్ పిలుపునిచ్చారు. చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామంలో తెల్సురి వద్ద ఏర్పాటు చేసిన బెల్లం చాయ్ షాప్‌ను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా యువత తమకు ఉన్న నైపుణ్యాలను వినియోగించుకుని స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. చిన్న స్థాయి వ్యాపారాలే భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు దారి తీస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వనరులు, అవసరాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని గుర్తించి వ్యాపార దిశగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.

స్వశక్తితో ముందుకు సాగిన యువతే ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. స్థానికంగా ప్రారంభించిన ఈ బెల్లం చాయ్ షాప్ గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఆనగంటి నరేష్, నూతి వెంకటేష్, ఆవుల జానయ్య, గుంటోజు రమేష్, అవుశెట్టి మహేష్, తెల్సురి నగేష్, శ్రీకాంత్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువత స్వశక్తితో ఎదగాలి: ఎస్‌.ఐ రవి కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News