Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:19 AM

రుద్రమ-1 ప్రయోగం విఫలం సైన్స్ దినోత్సవ వేడుకల్లో నిరాశ

28-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

భద్రకాళి బండ్ ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రయోగించిన “రుద్రమ-1” బుల్లి రాకెట్ ప్రారంభ దశలోనే విఫలమైంది. సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రకాళి బండ్ వద్ద ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో రాకెట్‌ను ప్రయోగించారు. అయితే రాకెట్ వంద అడుగుల ఎత్తుకూడా ఎగరలేక ప్రారంభ క్షణాల్లోనే నియంత్రణ కోల్పోయి కూలిపోయింది.

ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు వేలాదిగా విద్యార్థులు, శాస్త్రాభిమానులు, ప్రముఖులు హాజరయ్యారు. రాకెట్ విజయవంతంగా ఆకాశంలోకి దూసుకెళ్తుందని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. ప్రయోగం విఫలమవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది.

ఆయోజకులు సాంకేతిక లోపాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు సాంకేతిక పరిశీలన అనంతరం వెల్లడిస్తామని తెలిపారు.

సైన్స్ దినోత్సవం రోజున జరిగిన ఈ పరిణామం విద్యార్థుల్లో నిరుత్సాహం కలిగించినప్పటికీ, విఫలాలు కూడా విజ్ఞాన సాధనలో భాగమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

రుద్రమ-1 ప్రయోగం విఫలం సైన్స్ దినోత్సవ వేడుకల్లో నిరాశ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News