Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:35 AM

కేతేపల్లిలో కాంగ్రెస్ పండుగ.. నూతన సర్పంచ్‌కు ఎమ్మెల్యే వీరేశం శుభాకాంక్షలు

22-12-2025 70 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

కేతేపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఘన విజయం సాధించిన బీరం జాన్ రెడ్డితో పాటు నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం కేతేపల్లిలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నూతన సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ –

ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేపడతామని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసంతో గెలిచిన సర్పంచ్‌, పాలకవర్గ సభ్యులు ప్రజలకు సేవకులుగా పనిచేయాలన్నారు. కేతేపల్లి ప్రాంత సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం, అండర్‌పాస్ ఏర్పాటు వంటి కీలక పనులను చేపడతామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాభివృద్ధికి నిధుల కొరత ఉండదని, కేతేపల్లి పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Sthanikam

కేతేపల్లిలో కాంగ్రెస్ పండుగ.. నూతన సర్పంచ్‌కు ఎమ్మెల్యే వీరేశం శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News