Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ఇంటి వద్దే విద్యుత్ ఉత్పత్తి.. ఫ్లవర్ టర్బైన్ల కొత్త ప్రయోగం

06-03-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

దేశ ఇంధన రంగంలో కొత్త సాంకేతికతగా ఫ్లవర్ టర్బైన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇప్పటివరకు ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఎక్కువగా కనిపిస్తుండగా, ఇప్పుడు పూల మొగ్గ ఆకారంలో ఉండే ఈ గాలి విద్యుత్ యంత్రాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఫ్లవర్ టర్బైన్లు నిలువు అక్షంపై తిరుగుతూ గాలి శక్తిని విద్యుత్‌గా మార్చుతాయి. సాధారణ గాలి చక్రాల్లా పెద్ద రెక్కలు లేకుండా పనిచేయడం వీటి ప్రత్యేకత. వీటి పని సమయంలో శబ్దం చాలా తక్కువగా ఉండటం వల్ల నివాస ప్రాంతాల్లో కూడా సులభంగా అమర్చుకోవచ్చు.

ఈ టర్బైన్లు 300 వాట్లు నుంచి 5 కిలోవాట్ల వరకు సామర్థ్యంతో లభిస్తున్నాయి. ఒక కిలోవాట్ సామర్థ్యం గల టర్బైన్ ధర సుమారు రూ.85 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉండవచ్చని సమాచారం.

ఇంటి డాబా లేదా బాల్కనీలో కూడా వీటిని అమర్చుకోవచ్చు. గాలి వేగం తక్కువగా ఉన్నప్పటికీ ఇవి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేయగలవని నిపుణులు చెబుతున్నారు.

సోలార్ ప్యానెల్స్ పగలు మాత్రమే పనిచేయగా, ఫ్లవర్ టర్బైన్లు గాలి వీచినప్పుడల్లా పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయగలవని తెలిపారు.

అందమైన ఆకృతి, తక్కువ శబ్దం, పర్యావరణానికి హాని లేకపోవడం వంటి లక్షణాల వల్ల ఫ్లవర్ టర్బైన్లు భవిష్యత్‌లో గృహ విద్యుత్ ఉత్పత్తిలో కొత్త మార్గంగా నిలవవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

ఇంటి వద్దే విద్యుత్ ఉత్పత్తి.. ఫ్లవర్ టర్బైన్ల కొత్త ప్రయోగం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News