Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 11:03 AM

ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన.

ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన.

ఏపీలో నాలుగు కొత్త విమానాశ్రయాలు.. తాడేపల్లిగూడెంపై కేంద్రం కీలక ప్రకటన.
January 31, 2026 07:31 AM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District
Sr.Journalist YVN

తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన, అధ్యయనం చేయాలని ఏఏఐని కోరినట్లు తెలిపిన కేంద్ర మంత్రి. పరిశీలనలో ఉన్న కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలు ఎయిర్‌పోర్టుల ప్రతిపాదనలు.రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ కార్గో టెర్మినల్ సామర్థ్యం వినియోగం కావట్లేదని వెల్లడి.ఏపీలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెంలో కొత్త ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయమంత్రి మురళీధర్‌ మోహోల్‌ సమాధానమిచ్చారు. ఈ నెలలోనే ఏపీ ప్రభుత్వం నుంచి ఈ అభ్యర్థన అందిందని, విమానాశ్రయానికి అవసరమైన స్థల వివరాలను కూడా ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు అందజేసిందని ఆయన వివరించారు.


ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని మరో మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు సంబంధించి ప్రాథమిక అధ్యయనాలు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. కుప్పం, శ్రీకాకుళం, ఒంగోలులో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ఏఏఐ ఇప్పటికే అధ్యయనం పూర్తి చేసిందన్నారు. ఈ మూడు విమానాశ్రయాల నిర్మాణానికి అవసరమైన భూమి అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్స్‌' విధానం కింద పౌరవిమానయాన శాఖకు ప్రతిపాదనలు పంపిందని, అవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని మురళీధర్ మోహోల్ పేర్కొన్నారు.


మరోవైపు రాజమండ్రి ఎయిర్‌పోర్టులోని కార్గో టెర్మినల్ పూర్తిస్థాయిలో వినియోగంలో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఏటా 17,200 టన్నుల సామర్థ్యం ఉన్న ఈ టెర్మినల్ నుంచి 2024-25లో కేవలం 25 టన్నుల సరుకు మాత్రమే రవాణా అయిందని (0.15% వినియోగం) తెలిపారు. ఈ కారణంగా అక్కడ అదనపు కార్గో సౌకర్యాలు కల్పించే ఆలోచన లేదన్నారు.


ఏపీలో భారీగా పెరిగిన టోల్ ట్యాక్స్ వసూళ్లు

ఇదే సమయంలో ఏపీలో టోల్ ట్యాక్స్ వసూళ్లు గణనీయంగా పెరిగాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో వెల్లడించారు. రాష్ట్రంలో 2023లో రూ.3,402 కోట్లు, 2024లో రూ.3,495 కోట్లు వసూలు కాగా, 2025లో ఆ వసూళ్లు రూ.4,126 కోట్లకు చేరినట్లు ఆయన తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News