Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:07 PM

బొంతల చంద్రారెడ్డి గారు కేవలం అభ్యర్థి కాదు.. ఈ తరానికి గొప్ప పునాది: శివ పబ్బు (జవాన్ సేవ ఫౌండర్)

18-02-2026 101 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాజకీయాల్లో అనుభవం, వ్యక్తిత్వానికి నిలువుటద్దంలా నిలిచే బొంతల చంద్రారెడ్డి గారిపై జవాన్ సేవ ఫౌండర్ శివ పబ్బు ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రారెడ్డి గారితో గడిపిన సమయం తనకు ఇరవయ్యేళ్ల అనుభవాన్ని నేర్పిందని, ఆయన నిరాడంబరత అందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ సందర్భంగా శివ పబ్బు సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన ప్రకటన విడుదల చేశారు.

ఆయన మాటల్లోనే...

"అందరూ అతన్ని నాయకుడు అంటారు.. నేను మాత్రం సేవకుడు అంటాను. అందరూ అభ్యర్థి అంటే.. నేను అభినందనుడు అంటాను. ఏడు పదుల వయసులోనూ ఏ రాజకీయం ఆయనను ఓడించలేకపోయింది. ఆయన చెప్పే జీవిత అనుభవాల ముందు నా మాటలు మూగబోయాయి."

గుడి లాంటి ఇల్లు.. ఆత్మీయమైన ఆతిథ్యం:

చంద్రారెడ్డి గారి నివాసాన్ని సందర్శించిన శివ పబ్బు, అక్కడ ఉన్న వాతావరణాన్ని చూసి ముగ్ధులయ్యారు. "ఆయన గడప చూస్తుంటే ఒక గుడిని నిర్మించినట్లు అనిపిస్తుంది. నేను ఎవరో తెలియకపోయినా ఆయన సతీమణి ఎంతో ఆత్మీయంగా చాయ్ ఇచ్చి పలకరించడం నా మనసును గెలుచుకుంది" అని పేర్కొన్నారు.

యువతకు గొప్ప మార్గదర్శి:

తన తాత పబ్బు రోశయ్య గారి మిత్రుడైన బొంతల చంద్రారెడ్డి గారు నేడు పంచాయతీ సీటులో పెద్దరికంగా కూర్చోవడం, తెలియని యువతకు ఒక గొప్ప పునాది పడటమేనని శివ పబ్బు అభిప్రాయపడ్డారు. "నువ్వు చెప్పే అనుభవాలు మాకు ధైర్యాన్నిస్తాయి తాతా..!" అంటూ తన అభిమాన మనవడిగా ఆయనకు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు స్థానికంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా చంద్రారెడ్డి గారి వ్యక్తిత్వాన్ని శివ పబ్బు ఆకాశానికెత్తడం విశేషం.

Sthanikam

బొంతల చంద్రారెడ్డి గారు కేవలం అభ్యర్థి కాదు.. ఈ తరానికి గొప్ప పునాది: శివ పబ్బు (జవాన్ సేవ ఫౌండర్)

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News