Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

బోగారంలో సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

13-01-2026 256 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారంలో సంక్రాంతి సందడి… ముత్యాల ముగ్గులతో గ్రామం కళకళ

రామన్నపేట (మేజర్ న్యూస్):

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు గ్రామాన్ని పండుగ కళతో నింపాయి.సర్పంచ్ స్వయంగా ముగ్గుల పోటీలను ప్రారంభించి మహిళలకు ప్రోత్సాహం అందించారు. రంగురంగుల ముగ్గులు, సంప్రదాయ అలంకరణలతో గ్రామ వీధులు ఆకట్టుకున్నాయి. ఉత్తమ ముగ్గులు వేసిన వారికి నగదు బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ బహుమతులు అందజేశారు.

భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాస్ సందడి గ్రామంలో పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. సంప్రదాయానికి పట్టం కట్టి యువత, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ముగ్గుల పోటీల ఫలితాలు ఇలా ఉన్నాయి…

ప్రథమ బహుమతి – ఏ.ఎం.ఎస్. రెడ్డి (రూ. 5,116)

ద్వితీయ బహుమతి – గోగు అండాలు (రూ. 2,116)

తృతీయ బహుమతి – బద్దుల మధులిక (రూ. 1,016)

కన్సోలేషన్ బహుమతి – రాపోలు భాగ్య (రూ. 1,016)

ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్, ఉపసర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, వార్డు సభ్యులు, మహిళా సంఘాల నాయకులు, గ్రామ మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

బోగారంలో సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News